AP:
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం నాగులూరులో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి జోగి రమేష్, మండల నాయకుల నుంచి తనకు తగిన సహకారం అందడం లేదని ఆరోపిస్తూ, ఆ పార్టీ అభ్యర్థి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గ్రామంలోని పార్టీ వాట్సాప్ గ్రూపులో అభ్యర్థి, స్థానిక నాయకులు ఎన్నికల బహిష్కరణపై అధికారిక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో పార్టీలోనే నెలకొన్న ఈ అంతర్గత విభేదాలు, నాయకుల తీరుపై ఇప్పుడు స్థానికంగా చర్చ జరుగుతోంది.