AP: పిఠాపురంలో జీవన్ నగర్‌లోని దళితుల శ్మశానవాటికను కబ్జా చేశారని MRPS నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ సమస్యపై స్పందించకపోవడంతో అసంతృప్తి చెందిన నాయకులు, ప్లకార్డులతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పవన్ కళ్యాణ్ వచ్చి శ్మశాన వాటిక కబ్జాపై చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని MRPS నాయకులు స్పష్టం చేశారు.