AP: తూ.గో చెందిన ప్రముఖ కాపు నేత ముద్రగడ పద్మనాభం, టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్పతో భేటీ అయ్యారు. ఈ భేటీ మర్యాదపూర్వకమైనదే అయినప్పటికీ, ముద్రగడ తిరిగి కూటమి వైపు చూస్తున్నారని, తన కుమారుడు గిరికి రాజకీయ భవిష్యత్తును చూపించాలనే ఆలోచనతోనే ఈ అడుగులు వేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి గిరి ఇంచార్జిగా ఉన్నప్పటికీ, ఆ సీటు నుంచి 2029లో గిరిని ఎమ్మెల్యేగా చూడాలని ముద్రగడ ఆశిస్తున్నారని, అయితే గోదావరి జిల్లాల్లో జనసేన-టీడీపీ కూటమి ప్రభావం దృష్ట్యా, కుమారుడిని కూటమి వైపు పంపాలని ఆలోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.