ముఖర్జీ దేశ ఐక్యతకు ప్రతీక: ప్రధాని మోదీ

3235చూసినవారు
ముఖర్జీ దేశ ఐక్యతకు ప్రతీక: ప్రధాని మోదీ
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశ ఐక్యత, అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన 125వ జయంతి సందర్భంగా ముఖర్జీని స్మరించుకుంటూ, ధైర్యానికి, దేశభక్తికి ఆయన ప్రతీక అని అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేలా చూడటంతో పాటు, జమ్మూకశ్మీర్‌ను పూర్తిగా విలీనం చేయాలనే లక్ష్యంతో ఆయన పోరాడారని, నిర్బంధంలోనే ఆయన జీవితం ముగిసినా, దేశ సమైక్యత కోసం చేసిన త్యాగాన్ని ప్రధాని కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్