వడోదరలో జరిగిన కీలక మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్‌కు 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఆష్లే గార్డెనర్ 46, జార్జియా వార్హెమ్ 44*, అనుష్క శర్మ 33, సోఫీ డివైన్ 25 పరుగులు చేశారు. ముంబయి తరఫున అమెలియా కెర్ 2, షబ్నిమ్ ఇస్మాయిల్, నాట్ సివర్ బ్రంట్ చెరో వికెట్ తీశారు.