ఒకప్పటి సక్సెస్‌ఫుల్ హీరోయిన్ ముంతాజ్, తన పెళ్లి తర్వాత సినిమాలకు ఎందుకు దూరమయ్యారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సాంప్రదాయక ఇరానీ కుటుంబం నుంచి వచ్చిన తాను, ఏడెనిమిదేళ్ల వయసులోనే తన భర్త కుటుంబం గురించి తెలుసుకున్నానని, పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని తల్లిదండ్రులు, అత్తమామలు చెప్పడంతో, తన కోరికలను పక్కనపెట్టి మయూర్‌ను పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. షమ్మీ కపూర్‌తో పెళ్లి ఆగిపోవడానికి కారణం, ఆయన తండ్రి పెట్టిన కండీషనేనని, అప్పుడు తాను చాలా చిన్నదానినని, పెళ్లి కన్నా పని ముఖ్యమనుకున్నానని ముంతాజ్ పేర్కొన్నారు.