AP: రాష్ట్రం ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలపై కూడా ప్రత్యేక చర్చ జరిగింది. మరో మూడు, నాలుగు నెలలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధం కావాలని సూచించారు.