పుణెలో మూడేళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితుడికి ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన వృద్ధుడికి కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. మే 1న జరిగిన ఈ దారుణ ఘటనపై పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కోర్టు సైతం కేవలం 60 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వడం విశేషం. సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘోర కలిని న్యాయస్థానం 'అత్యంత అరుదైన కేసు'గా పరిగణించింది.