మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి విజయాన్ని నిర్ణయించేది ఏ ఫండ్ ఎంచుకున్నామన్నది కాదని, డబ్బును వివిధ ఆస్తుల్లో ఎలా విభజించామన్నదేనని పెట్టుబడి నిపుణులు సూచిస్తున్నారు. ఈక్విటీ, డెట్, గోల్డ్ వంటి విభిన్న అసెట్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గి స్థిరమైన రాబడులు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. మార్కెట్ ఒడిదుడుకుల్లో SIPలను ఆపడం లేదా ఫండ్లు మార్చడం తప్పని హెచ్చరించారు. నెలకు రూ.10 వేలతోనైనా SIP ప్రారంభించి క్రమశిక్షణగా కొనసాగిస్తే, ఆదాయం పెరిగేకొద్దీ పెట్టుబడిని పెంచడం ద్వారా దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రయోజనాలు పొందవచ్చని వివరించారు.