నా స్నేహితుడి ప్రాణం తీశారు: ఎమ్మెల్యే గంటా

30211చూసినవారు
నా స్నేహితుడి ప్రాణం తీశారు: ఎమ్మెల్యే గంటా
AP: వైసీపీ వేధింపులపై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా సమయంలో అమెరికా నుంచి వచ్చిన వాట్సప్ మెసేజ్‌ను తన స్నేహితుడు ఫార్వర్డ్ చేశాడని, అది వైసీపీ నేతను అవమానపరిచేలా ఉందని సీఐడీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని అన్నారు. విశాఖ నుంచి కర్నూలుకు తరలించగా.. కరోనా బారిన పడి మరణించారని ఆరోపించారు. ఈ ఘటనకు వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్