AP: 2028 జూన్ 12 నాటికి నెల్లూరును గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులోని నవాపేటలో ఏర్పాటు చేయనున్న మార్కెట్ పనులకు మంత్రి నారాయణ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై కొందరు అసత్య ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు వాటిని నమ్మరని స్పష్టం చేశారు. తాను సంపాదించాలనుకుంటే తన విద్యాసంస్థల ద్వారానే వేల కోట్లు సంపాదించవచ్చని, లక్ష మంది ఉపాధి పొందుతున్నారని మంత్రి వివరించారు.