ఏపీ సచివాలయం వద్ద ఓ వృద్ధురాలు ఆందోళన చేపట్టారు. అక్రమంగా ఆన్‌లైన్‌లో తన పేరు తొలగించి 50 ఎకరాల భూమిని కబ్జా చేశారని బాధితురాలు వాపోయారు. అధికారులకు తన సమస్యను ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో, ఇప్పటి కూటమి ప్రభుత్వంలో సచివాలయం చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.