బాలీవుడ్ నటి సోనాలీ బింద్రేకు షాక్ తగిలింది. తమ 30 గుంటల భూమిని సోనాలీ, ఆమె భర్త గోల్డి బెహల్ ఆక్రమించారని పుణేకు చెందిన రైతు చంద్రకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ భూమి 1957 నుంచి తమ వంశపారంపర్యంగా వస్తోందని, తనను బెదిరించి లాక్కున్నారని రైతు ఆరోపిస్తున్నారు. దీనిపై సొనాలి స్పందించారు. తాను చట్టబద్ధంగానే భూమిని కొనుగోలు చేశానని, తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఇలా చేస్తున్నారని, కోర్టులో తేల్చుకుంటానని సోనాలీ బింద్రే తెలిపారు.