AP: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా బెండమూర్లంకకు చెందిన జనసైనికుడు రోళ్ల ప్రేమ్ కుమార్ మృతిపట్ల
జనసేన నేత
నాగబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పవన్ జన్మదిన వేడుకలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ప్రేమ్ కుమార్ మృతి చెందడం విషాదకరమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులను వీడియో కాల్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబికులకు నిర్మాత ఎస్‌కేఎన్ రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు.