ఏపీ లిక్కర్ కేసు దర్యాప్తులో తెరపైకి మరికొంతమంది వైసీపీ నేతల పేర్లు బయటకు వచ్చాయి. చెవిరెడ్డి భాగస్వామి విజయానంద రెడ్డి విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి మేనల్లుడికి భారీగా ముడుపులు అందాయని, గోదావరి, గుంటూరుకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులకు కూడా ముడుపులు అందినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేకు కమిషన్ ఇచ్చినట్లు సమాచారం.