దర్శకురాలు నందిని రెడ్డి తన వ్యక్తిగత జీవితం, పెళ్లి చేసుకోకపోవడం, ఒంటరితనంపై స్పందించారు. 50 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా లైఫ్ లీడ్ చేయడంపై ఆమె మాట్లాడుతూ, తన మెంటాలిటీకి సింక్ అయ్యే వ్యక్తి దొరకలేదని, అందుకే పెళ్లి చేసుకోలేదని తెలిపారు. ఒంటరితనం వేధించట్లేదని, జీవితంలో మొగుడు-పెళ్లాం బంధంతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులు వంటి ఎన్నో బంధాలు ఉండాలని, తన చుట్టూ అద్భుతమైన రిలేషన్స్ ఉన్నాయని, తన పక్కన లేనిది మొగుడు ఒక్కడేనని ఆమె స్పష్టం చేశారు.