Nov 25, 2025, 14:11 IST/
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు.. 17% మాత్రమే అమలు
Nov 25, 2025, 14:11 IST
తెలంగాణలో మొత్తం 12,735 గ్రామ పంచాయతీలకు గాను కేవలం 2,176 గ్రామాలకు మాత్రమే బీసీ రిజర్వేషన్లు అమలు చేశారు, ఇది కేవలం 17.08% మాత్రమే. భద్రాద్రి జిల్లాలో 471 గ్రామాలకు ఒక్కటి కూడా బీసీలకు కేటాయించలేదు. సిద్ధిపేట జిల్లాలో 508 గ్రామాలకు 136 కేటాయించారు. గత ఎన్నికల్లో బీసీలకు 20% రిజర్వేషన్లు లభించినా, ఈసారి రొటేషన్ల వల్ల తగ్గినట్లు సమాచారం. ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించినా, కోర్టు కేసుల వల్ల అది సాధ్యం కాలేదని తెలుస్తోంది.