బోలేరో - ఎద్దుల బండి ఢీకొన్న ఘటనలో తెగిపడిన పాదం !

9చూసినవారు
బోలేరో - ఎద్దుల బండి ఢీకొన్న ఘటనలో తెగిపడిన పాదం !
ఆదోని శివారులో శనివారం బోలేరో వాహనం ఎద్దుల బండిని ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దకడబూరుకు చెందిన పవన్ కుమార్ ఎడమ కాలి పాదం పూర్తిగా తెగిపోయింది. ఆదోనికి చెందిన ఉమేశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై వన్ టౌన్ ఎస్సై విజయ్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఓ ఎద్దు మృతి చెందిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్