ఆదోని: సర్వేయర్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవు: కలెక్టర్

313చూసినవారు
ఆదోని: సర్వేయర్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవు: కలెక్టర్
కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి గురువారం కలెక్టరేట్‌లో సర్వే విభాగంపై సమీక్ష నిర్వహించారు. సర్వేయర్ల పనితీరుపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ సర్వే విభాగంలో పారదర్శకత, బాధ్యత, ప్రజల నమ్మకం పెంచాలని సూచించారు. వంద శాతం హాజరు నమోదు చేయాలని, రీ సర్వేలో అవకతవకలకు తావివ్వొద్దని ఆదేశించారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని, రెవెన్యూ శాఖతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్