ఆదోని: ప్రజలలో ప్రభుత్వ పథకాలపై అవగాహన పెరిగింది

548చూసినవారు
ఆదోని: ప్రజలలో ప్రభుత్వ పథకాలపై అవగాహన పెరిగింది
ఆదోని నియోజకవర్గంలో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో బడ్జెట్ 2026-2027 ఔట్రీచ్ కార్యక్రమం బుధవారం జరిగింది. ఇందులో స్థానిక ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పార్థసారధి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వ బడ్జెట్‌లోని ముఖ్య అంశాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు అందించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా చేరేలా కృషి చేస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా అవగాహన పెరుగుతుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్