రాష్ట్రంలో చేనేత రంగాన్ని పునరుజ్జీవింపజేసేందుకు కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కర్నూలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. బుధవారం ఆదోనిలో నియోజకవర్గం టిడిపి ఇంచార్జి, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు సీనియర్ నేత ఉమాపతి నాయుడుతో కలిసి నేతన్నలతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ పథకం అమలులోకి వచ్చిందని, ఈ పథకం ముఖ్యంగా చేనేత కుటుంబాల జీవితాల్లో విద్యుత్ భారాన్ని పూర్తిగా తొలగించి, వారి ఆదాయాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉందన్నారు.