ఆదోని: హోంగార్డులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి

1008చూసినవారు
ఆదోని: హోంగార్డులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
సదరన్ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ ఎం. మహేష్ కుమార్ శుక్రవారం ఆదోనిలో పర్యటించి, హోంగార్డుల పరేడ్‌ను పరిశీలించారు. విధుల నిర్వహణ, క్రమశిక్షణ, సంక్షేమం, ప్రజలకు అందిస్తున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో హోంగార్డ్స్ డీఎస్పీ ప్రసాద్, ఆర్‌ఐ పోతల రాజు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్