రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఆదోని పోలీసులు గురువారం కీలక చర్యలు చేపట్టారు. ఆదోని-ఆలూరు, సిరిగుప్ప రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు మొత్తం 12 స్పీడ్ స్టాపర్లను ఏర్పాటు చేశారు. ఆదోని రూరల్ సీఐ నల్లప్ప పర్యవేక్షణలో ఈ పనులు జరిగాయి. ధనపురం, నారాయణపురం, సంతకుళ్లూరు గ్రామాలకు సమీపంలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ చర్యల వల్ల గ్రామాల వద్ద వాహనాల వేగం తగ్గి, ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, రోడ్డు భద్రతకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.