ఆదోని పట్టణంలోని 24వ వార్డు శంకర్‌నగర్‌లో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని కర్నూలు పార్లమెంట్
టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, యువ నాయకుడు సిద్ధార్థ నాయుడు శనివారం పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు బీఎల్‌వో అధికారులతో, ఓటర్లతో మాట్లాడి వెరిఫికేషన్ పురోగతిని తెలుసుకున్నారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ జరగాలని సూచించారు. సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని, పరిష్కారానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.