ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప మాట్లాడుతూ, కుటుంబ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు పూర్తయిందని, సీఎం చంద్రబాబు నాయుడు వితంతువులకు ప్రతి నెలా ఒకటో తేదీ లోపు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఇది చంద్రన్నకే సాధ్యమని, గత 22 నెలల్లో దాదాపు రూ. 64 వేల కోట్లకు పైగా వితంతువులకు ఆసరాగా నిలిచిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. బుధవారం ఆదోని డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.