ఆదోనిలో ముందస్తు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ

307చూసినవారు
ఆదోనిలో ముందస్తు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ
ఆదోనిలో టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో పింఛన్ పండుగ ఒకరోజు ముందుగానే వచ్చిందని తెలిపారు. శనివారం ఆదోనిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు బాబుజిపేట, హనుమాన్ నగర్, పెద్దశక్తి గుడి పరిసర ప్రాంతాల్లో పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్