లక్ష్మి మృతికి న్యాయం చేయాలంటూ కుటుంబీకుల ధర్నా

1చూసినవారు
లక్ష్మి మృతికి న్యాయం చేయాలంటూ కుటుంబీకుల ధర్నా
నెట్టేకెల్ గ్రామ సమీపంలో ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో లక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంతో కుటుంబంలో విషాదం నెలకొంది. లక్ష్మి మృతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కుటుంబీకులు ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని విరమించేది లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. అధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్