ఆదోని మండలం నెట్టకల్ గ్రామంలో సోమవారం సాయంత్రం ఆటో, బైక్ మధ్య జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఈ రెండు వాహనాలు ఢీకొన్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.