కర్నూలు: ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసుల ఉక్కుపాదం

369చూసినవారు
కర్నూలు: ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసుల ఉక్కుపాదం
కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ నిబంధనల అమలును కఠినతరం చేస్తున్నట్లు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జనవరి 1 నుంచి జూన్ 12 వరకు జిల్లాలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు విస్తృత చర్యలు చేపట్టి, 3,920 ఓవర్ స్పీడ్, 3,016 హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన కేసులు, 1,054 సెల్‌ఫోన్ డ్రైవింగ్ ఉల్లంఘనలపై ఈ-చలాన్లు నమోదు చేశారు. అలాగే, 4,085 డ్రంకెన్ డ్రైవింగ్, 7,675 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశారు. ప్రతి శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్