విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం

830చూసినవారు
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం
కౌతాళం మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హుస్సేన్ అనే వ్యక్తి బట్టలు ఉతకడానికి వెళ్ళిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో సుమారు రూ.75 వేల నగదు, 2 తులాల బంగారం, 8 తులాల వెండి, వంట సరుకులతో సహా సర్వస్వం అగ్నికి ఆహుతి అయింది. బాధితులు కట్టుబట్టలతో మిగిలిపోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్