ఆదోని పట్టణంలోని వాల్మీకి నగర్‌లో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మంగళవారం వార్డు పర్యటన నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. బీఎల్సీ పథకం కింద ఇళ్లు నిర్మించుకుని బిల్లులు అందని లబ్ధిదారులు బిల్లులు మంజూరు చేయాలని, మరికొందరు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు. కాలనీలో మౌలిక వసతులు మెరుగుపరచాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పురపాలక కమిషనర్ నయీం మహ్మద్, మాజీ కౌన్సిలర్ పార్వతీ వెంకటేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు.