కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట్ర కురుబ–కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పాల్గొన్నారు. ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి అంగవైకల్యం నుంచి కాపాడాలని తల్లిదండ్రులకు సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లలను పంపించి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది,
టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.