కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఆదివారం ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, నేర చరిత్ర గలవారు, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.