ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేయాలి.. వామపక్షాలు

29చూసినవారు
ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేయాలి.. వామపక్షాలు
ఆదోనిలో సోమవారం సీపీఐ, సీపీఎం, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ఎన్నికల సంస్కరణలు, ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. శ్రీనివాస్ భవన్ కూడలిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట జరిగిన కార్యక్రమంలో వామపక్ష నాయకులు ఎన్నికల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సంఘం స్వతంత్రత, నిష్పాక్షికత, పారదర్శకతను బలోపేతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్