స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా, ఆదోని పురపాలక సంఘం శనివారం వ్యర్థ రహిత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. సహాయ కమిషనర్ మహమ్మద్ నశీర్ హుస్సేన్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, స్థానికులు, మహిళా సంఘాల సభ్యులు భారీ ర్యాలీలో పాల్గొని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే ప్రతిజ్ఞ చేశారు. ఆదోనిని చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.