
తుఫాన్ ప్రభావం.. అహోబిలం ఆలయం సాయంత్రం మూసివేత
మొంథా తుఫాన్ కారణంగా ఆళ్లగడ్డ, శిరివెళ్ల, నంద్యాల ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యాయి. భద్రతా కారణాల దృష్ట్యా మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఎగువ అహోబిలం ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు దాటేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్, డీఎస్పీ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 101 లేదా 08514293903 నంబర్లకు కాల్ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు.



































