నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పి. చింతకుంటలో 2012లో జరిగిన నలుగురి హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో 12 మంది నిందితులకు జీవితఖైదు విధించింది. మొత్తం 19 మంది నిందితుల్లో ఏడుగురు ఇప్పటికే మరణించగా, మిగిలిన వారికి శిక్ష ఖరారైంది. ఈ తీర్పు సంచలనం సృష్టించింది.