తెలంగాణ నుంచి చెన్నైకి అత్యంత పకడ్బందీగా శనివారం అర్ధరాత్రి కంటైనర్ల ద్వారా తరలిస్తున్న సుమారు 400 ఆవులను ఆళ్లగడ్డ వద్ద పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసుల కళ్లుగప్పేందుకు ఆరు భారీ కంటైనర్లలో ఆవులను కుక్కి, వాటికి ముందు వెనుక పైలట్ వాహనాలుగా ఇన్నోవా కార్లను ఏర్పాటు చేశారు. ఈ అక్రమ రవాణా విషయం తెలియగానే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అప్రమత్తమై, గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారు. పట్టుబడిన గోవులన్నీ ఆరోగ్యంగానే ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.