ఆళ్లగడ్డ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామంలో గత 14ఏళ్లుగా గ్రామాధిపత్యం పోరులో మూతబడిన శివాలయం ఉత్తర ద్వారం తలుపులు శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎట్టకేలకు తెరుచుకున్నాయి. చింతకుంట గ్రామ ప్రజలు, పెద్దలు కూటమి నేతల నడుమ సయోధ్య కుదరడంతో ఆలయం తలుపులు ఎట్టకేలకు తెరిచి స్వామి వారికి గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.