నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గోవుల అక్రమ రవాణా కలకలం రేపింది. ఆళ్లగడ్డ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా భారీ ఎత్తున గోవులను తరలిస్తున్న వాహనాలను స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడ్డుకున్నారు. ఒక్కో కంటైనర్‌లో 70కి పైగా గోవులను క్రూరంగా తరలిస్తున్న తీరును ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. మొత్తం 5 వాహనాలను పోలీసులకు అప్పగించారు. తప్పించుకున్న మరో 10 వాహనాలను పట్టుకోవాలని ఆదేశించారు.