డోన్ మండలం కామగనికుంట్ల సమీపంలో సోమవారం అతివేగంగా వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న రైతులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సహాయంతో అందరూ సురక్షితంగా బయటపడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.