డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తికి 5 రోజుల జైలు

3932చూసినవారు
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తికి 5 రోజుల జైలు
ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మిట్టపల్లె ఓబులేశ్ మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. బ్రెత్ అనలైజర్ పరీక్షలో అతను పరిమితికి మించి మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రవికుమార్ ఎదుట హాజరు పరచగా, అతనికి 5 రోజుల జైలు శిక్ష విధించారు.

సంబంధిత పోస్ట్