జూన్ 12 నుంచి కొత్త పెన్షన్ దరఖాస్తులు: ఎమ్మెల్యే కోట్ల

267చూసినవారు
జూన్ 12 నుంచి కొత్త పెన్షన్ దరఖాస్తులు: ఎమ్మెల్యే కోట్ల
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పెన్షన్ల మంజూరుకు జూన్ 12 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి తెలిపారు. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, వికలాంగుల పెన్షన్లకు అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేవారు ఆధార్ కార్డు, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు సంబంధిత పెన్షన్‌కు అవసరమైన పత్రాలను సమర్పించాలని సూచించారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్