మాయలూరులో లభ్యమైన శిశువు కోసం బంధువుల అన్వేషణ

590చూసినవారు
మాయలూరులో లభ్యమైన శిశువు కోసం బంధువుల అన్వేషణ
ఉయ్యాలవాడ మండలం మాయలూరు గ్రామ పంచాయతీ పరిధిలో మే 10న పాడుబడిన ఇంట్లో లభ్యమైన శిశువును నంద్యాల పొన్నాపురం కాలనీలోని ప్రత్యేక దత్తత కేంద్రంలో సంరక్షిస్తున్నట్లు జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి అధికారి లీలావతి తెలిపారు. శిశువు తల్లిదండ్రులు లేదా బంధువులు తగిన ఆధారాలతో అధికారులను సంప్రదించి శిశువును తీసుకెళ్లవచ్చన్నారు. 30 రోజులలోపు ఎవరూ ముందుకు రాకపోతే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్ణయం మేరకు శిశువును అనాథగా ప్రకటించి దత్తత ప్రక్రియ చేపడతామని వెల్లడించారు.