ఆళ్లగడ్డ ఈద్గా క్రాసింగ్ వద్ద సోమవారం రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కడప వైపు నుంచి వస్తున్న ఆటోలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్రాసింగ్ వద్ద వాహనాలు అతివేగంగా వెళ్లడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.