ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గంగుల నాని ఆదివారం 'డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్' పోస్టర్‌ను ఆవిష్కరించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, కూటమి పాలనలో అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలవడానికి ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు. పార్టీ కార్యకర్తల హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని గంగుల నాని స్పష్టం చేశారు.