మోహన్ బాబుపై క్రిమినల్ కేసు పెట్టాలి: బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్

1020చూసినవారు
బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర జోనల్ ఇంచార్జ్ బొగ్గుల హనుమన్న, తిరుపతి విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై యూనివర్సిటీ యాజమాన్యం క్రిమినల్ కేసు నమోదు చేసి, బౌన్సర్లను అరెస్ట్ చేసి విద్యార్థులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలను వెంటనే సీజ్ చేయాలని, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్ వినోద్ లను కిడ్నాప్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి రామలింగయ్య, ఎమ్మిగనూరు తాలూకా అధ్యక్షులు బంగారప్ప, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్