ఆలూరు పరిధిలోని హోళగుంద మండలం హేబ్బటం గ్రామంలో పెద్దవంక ఉప్పొంగి ప్రవహిస్తోంది. శనివారం అర్ధరాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రెవిన్యూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి, వాగులు వంకలు దాటవద్దని సూచించారు.