కర్నూలు జిల్లా ఆస్పరి మండల కేంద్రంలో గురువారం జ్వరం వచ్చిన యువకుడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సకాలంలో వైద్యం అందలేదు. సాయంత్రం 4 గంటల తర్వాత వైద్య సేవలు నిలిపివేస్తామని సిబ్బంది చెప్పడంతో, యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గతంలోనూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని, ప్రభుత్వ ఆసుపత్రులు అందరికీ అందుబాటులో ఉండాలని, డాక్టర్లు ఇలా మాట్లాడటం ప్రజల పరిస్థితిని మరింత దిగజార్చుతుందని ఆయన వాపోయాడు.