ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా శుక్రవారం ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి, నియోజకవర్గ పరిశీలకుడు రామచంద్రారెడ్డి, వైకుంఠం మల్లికార్జున చౌదరి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి చెక్‌పోస్ట్ వరకు ఈ ర్యాలీ జరిగింది.